దేశంలో 35 లక్షలు దాటిన కరోనా కేసులు..

220
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య రికార్డు స్ధాయిలో 80 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 78,761 కరోనా కేసులు నమోదుకాగా 948 మంది మృత్యువాతపడ్డారు.

దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 35,42,734కు చేరగా 27,13,934 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 7,64,302 యాక్టివ్ కేసులున్నాయి. 63,498 మంది కరోనాతో మృతిచెందారు.

నిన్న ఒక్కరోజే 10,55,027 టెస్టులు చేయగా ఆగస్టు 29 నాటికి మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 4,14,61,636 కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.