రాష్ట్రంలో 24 గంటల్లో 2932 కరోనా కేసులు..

211
coronavirus
- Advertisement -

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య లక్షా 20 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 2,932 కరోనా కేసులు నమోదుకాగా 11 మంది మృతిచెందారు.దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,17,415కి చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 28,941 యాక్టివ్ కేసులుండగా 87,675 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు కరోనాతో 799 మంది మృతిచెందారు.

జిల్లాల వారీగా గత 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే జీహెచ్‌ఎంసీ పరిధిలో 520 ,భద్రాద్రి కొత్త గూడెంలో 89,జగిత్యాలలో 113, కరీంనగర్ లో 168, ఖమ్మంలో 141, మంచిర్యాలలో 110, మహబూబాబాద్ జిల్లాలో 76, నల్గొండలో 159, వరంగల్ అర్బన్ లో 80 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -