24 గంటల్లో 2795 కరోనా కేసులు..

125
coronavirus

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 2795 కరోనా కేసులు నమోదుకాగా 8 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,14,483కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 27,600 యాక్టివ్ కేసులుండగా 86,095మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 778 మంది మృత్యువాతపడ్డారు.

జిల్లాల వారీగా పరిశీలిస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 449, భద్రాద్రి కొత్త గూడెంలో 72, జగిత్యాలలో 89, కరీంనగర్ లో 136, ఖమ్మంలో 152, మంచిర్యాలలో 106, మహబూబాబాద్ జిల్లాలో 102, నల్గొండలో 164, నిజామాబాద్ లో 112, పెద్దపల్లిలో 77 కేసులు నమోదయ్యాయి.