స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు!

196
gold rate

బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 290 తగ్గి రూ.49,190కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.390 తగ్గి రూ.53,660కి చేరింది.

అయితే బంగారం ధరలు తగ్గినా వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ. 50 పెరిగి రూ. 65,550కి చేరగా అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో పాటుగా, ఆర్ధిక వ్యవస్థలు క్రమంగా పుంజుకోవడం కూడా బంగారం ధరలు తగ్గడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.