- Advertisement -
తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 650 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. బుధవారం ఆరు కరోనా కేసులు నమోదుకాగా 8 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 118 కరోనా నుండి కొలుకోగా 18 మంది మృత్యువాత పడ్డారు.
రోజురోజుకి కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. ఎంతమంది కరోనా రోగులకైనా చికిత్స చేసేందుకు సిద్ధమని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఇక తెలంగాణలో నిజామాబాద్, నిర్మల్ జిల్లాలు రెడ్‌జోన్ జాబితాలో ఉండగా కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి. 14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే రెడ్‌జోన్ నుంచి ఆరెంజ్ జోన్‌కు, ఆరెంజ్ జోన్ నుంచి గ్రీన్ జోన్‌కు మార్పులు చేపడతారు.
- Advertisement -