ఒక్కరోజే 61…మొత్తం 592

167
kcr
- Advertisement -

కరోనా వైరస్‌ రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ప్రభుత్వం కరోనా నియంత్రణకు అన్ని చర్యలు చేపడుతున్నా రోజు కొత్త కేసులు భయటపడుతుండటం అందరిని ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు గ్రేటర్ పరిధిలో 17 జోన్లుగా విభజించి కరోనా కట్టడికి కఠిన చర్యలు చేపట్టనున్నారు.

సోమవారం ఒక్కరోజే 61 కేసులు నమోదుకాగా ఇప్పటివరకు తెలంగాణలో 592 పాజిటివ్ కేసులు రిజిష్టర్ అయ్యాయి. నిన్న నమోదైన 61 కేసుల్లో 34 హైదరాబాద్‌లోనే కావడం విశేషం.

సోమవారం ఒక రోగి మరణించడంతో కరోనా మృతుల సంఖ్య కూడా 17కు పెరిగింది. ఒక్క హైదరాబాద్‌లోనే 216 మంది రోగులు చికిత్స పొందుతున్నారంటే.. ఇక్కడ వైరస్‌ తీవ్రత ఏవిధంగా ఉన్నదో అర్థంచేసుకోవచ్చు. హైదరాబాద్‌ తరువాత నిజామాబాద్‌, రంగారెడ్డి, వరంగల్‌ జిల్లాలో అధికంగా కేసులు నమోదయ్యాయి.

పాజిటివ్‌ కేసులు నమోదైన కంటైన్‌మెంట్‌ జోన్లను మరింత పకడ్బందీగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

- Advertisement -