రాష్ట్రంలో 24 గంటల్లో 1554 కరోనా కేసులు…

105
telangana corona

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 1,554 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏడుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 2,19,224 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 1,435 మంది కరోనా నుండి రికవరీ కాగా మొత్తంగా 1,94,653 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాతో 1256 మంది మృతిచెందారు. హైదరాబాద్ పరిధిలో 249, రంగారెడ్డిలో 128,మేడ్చల్‌లో 118 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 43,916 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకు కరోనా టెస్టుల సంఖ్య 37,46,963కి చేరాయి.