నాన్న పేరే మర్చిపోయా: బిగ్ బాస్ 4 హారిక

255
harika

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 40 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇక 40వ ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యుల చిన్ననాటి,ఫ్యామిలీ ఫోటోలను స్క్రీన్‌ పై షేర్ చేస్తూ సభ్యులను ఎమోషన్‌కి గురిచేశారు బిగ్ బాస్‌.

ఇక టాస్క్‌లో భాగంగా చిన్ననాటి జ్ఞాపకాలను ఇంటి సభ్యులతో పంచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా తన ఫ్యామిలీ గురించి వివరిస్తూ ఎమోషన్ అయింది హారిక. అది నా ఇంట‌ర్మీడియ‌ట్‌. అమ్మ‌మ్మ ఇంటికి ర‌మ్మంటే వెళ్లాను. అక్క‌డ మా అమ్మానాన్న విడిపోతున్నార‌ని చెప్పారు. నాన్న ద‌గ్గ‌ర ఉండ‌మ‌న్నారు. అమ్మ మాత్రం ఖాళీ బ్యాగుతో వెళ్లిపోయింది.

ఆ తర్వాత అన్నయ్య,తాను అమ్మ దగ్గరికి వెళ్లిపోయాం…అలా ఐదు సంవత్సరాలు గడిచింది. ఓ సారైతే నాన్న పేరు కూడా గుర్తుకురాలేదు…మా అమ్మ అంత బాగా చూసుకుందని తెలిపింది హారిక. మేమెప్పుడూ తిరిగి చూడ‌లేదు, మీరెప్పుడు తిరిగి చూడ‌లేదు. తిరిగి చూసిన‌రోజు మేం ఆగిపోతాం. అందుకే ఎప్ప‌టికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. అమ్మా.. నువ్వు లేని రోజు నేను లేను, నాన్న లేని లోటు అన్న తీర్చాడన కంటతడి పెట్టింది హారిక.