పెరిగిన బంగారం ధరలు…

141
gold rate

బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.490 పెరిగి రూ.52,530కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.460 పెరిగి రూ.48,160కు చేరింది.

బంగారం బాటలోనే వెండికూడా భారీగా పెరిగింది. కేజీ వెండిపై రూ.2700 పెరిగి రూ.60,700కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.12 శాతం తగ్గుదలతో 1900 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.69 శాతం తగ్గుదలతో 24.27 డాలర్లకు చేరింది.