రాష్ట్రంలో 24 గంటల్లో 1967 కరోనా కేసులు…

116
corona

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 1,967 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 9 మంది మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,85,833కి చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 30,234 యాక్టివ్ కేసులుండగా 1,54,499 మంది కోలుకొని చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటివరకు 1,100 మంది మృతి చెందారు.

కరోనా మరణాల రేటు 0.59 శాతంగా ఉండగా రికవరీ రేటు 82.939 శాతంగా ఉందని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 50,108 మందికి కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 28,50,869 టెస్టులు పూర్తిచేసినట్లు వివరించింది.