బిగ్ బాస్…బిగ్ సర్‌ప్రైజ్!

124
anushka sharma

బిగ్‌ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా మూడు వారాలు పూర్తిచేసుకుంది. ఇప్పటికి హౌస్‌ నుండి ఇద్దరు ఎలిమినేట్ కాగా ఇవాళ మూడో వ్యక్తి ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. ఇక ఇప్పటివరకు హౌస్‌లో ముగ్గురు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వగా తాజాగా మరో సర్‌ ప్రైజ్ ఇవ్వనున్నారు బిగ్ బాస్.

అందాల భామ అనుష్క బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లనుంది. అనుష్క నటించిన తాజా చిత్రం నిశ్శ‌బ్ధం ప్రమోషన్‌లో భాగంగా బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లనుంది అనుష్క. అమెజాన్ ప్రైమ్ ద్వారా అక్టోబర్ 2న చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆదివారం నేటి ఎపిసోడ్ లో నిశ్శ‌బ్ధం టీం, హౌజ్ మేట్స్ క‌లిసి ప్రేక్ష‌కుల‌కి మ‌రింత వినోదాన్ని అందించ‌నున్నార‌ని స‌మాచారం.