దేశంలో 60 లక్షలకు చేరువలో కరోనా కేసులు…

152
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60 లక్షలు దాటాయి. రోజుకు 85 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా గత 24 గంట‌ల్లో 88,600 పాజిటివ్ కేసులు నమోదుకాగా 1124 మంది మృతిచెందారు.

దేశంలో ఇప్పటివరకు కరోనా కేసులు 59,92,533కు చేరగా 9,56,402 యాక్టివ్ కేసులున్నాయి. 49,41,628 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్ప‌టివ‌రకు కరోనాతో 94,503 మంది మృతిచెందారు.

సెప్టెంబ‌ర్ 26 వ‌ర‌కు దేశంలో 7,12,57,836 టెస్టులు చేయగా ఒకేరోజు 9,87,861 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని తెలిపింది.