24 గంటల్లో 2381 కరోనా కేసులు

97
corona

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 2,381 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 10 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,81,627కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 30,387 యాక్టివ్ కేసులుండగా ఇప్పటి వరకు 1080 మంది మృతి చెందారు.కరోనా బారిన పడి 1,50,160 మంది పూర్తిగా కోలు కున్నారు. గత 24 గంటల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 386, రంగా రెడ్డి జిల్లాలో 227, మేడ్చల్‌లో 193 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.59 %గా ఉండగా రికవరీ రేటు 82.67% శాతానికి పెరిగింది.