బీహార్ ఎన్నికల నిర్వహణకు ఈసీ సన్నద్ధం..!

111
election-commission-of-india

బీహార్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. మధ్యాహ్నం 12:30 కు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసే అవకాశం ఉండగా బీహార్ అసెంబ్లీ తో పాటు, దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించే యచనలో ఉంది. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీ కాల‌ప‌రిమితి న‌వంబ‌ర్ 29తో ముగియ‌నుంది. ఆలోపు ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉన్న‌ది. దీంతో ఎన్నిక‌ల క‌మిష‌న్ అన్నిఏర్పాట్లు చేస్తున్న‌ది.