24 గంటల్లో 2043 కరోనా కేసులు..

117
coronavirus

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 2043 కరోనా కేసులు నమోదుకాగా 11 మంది మృతిచెందారు.దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,67,046కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 30,673 యాక్టివ్ కేసులుండగా 1,35,357 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 1016 మంది మృతిచెందారు. జీహెచ్ఎంసి పరిధిలో 314, కరీంనగర్ లో 114, మేడ్చల్ లో 144, నల్గొండలో 131, రంగారెడ్డిలో 174, సిద్ధిపేటలో 121, వరంగల్ అర్బన్ లో 108 కేసులు నమోదయ్యాయి.