రాష్ట్రంలో 24 గంటల్లో 922 కరోనా కేసులు..

140
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 922 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏడుగురు మృతిచెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,40,970 కు చేరుకున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 17,630 యాక్టివ్ కేసులుండగా ఇప్పటి వరకు 2,21,992 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 1348 మంది మృత్యువాతపడ్డారు.

దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంటే… రాష్ట్రంలో 0.55 శాతానికి పడిపోయింది. రికవరీ రేటు దేశవ్యాప్తంగా 91.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 92.12 శాతంగా ఉందదని తెలిపింది. గత 24 గంటల్లో 25,643 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -