ఇటలీలో ప్రభాస్‌,పూజ రొమాన్స్‌..!

137
Prabhas

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధే శ్యామ్’. ఈ మూవీలో ప్రభాస్‌ సరసన పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం యూరోప్ బ్యాక్ డ్రాప్‌లో కొనసాగుతుంది. 60వ దశకంలో జరిగే ఒక ప్రేమకథ చిత్రం ఇది. ఈ చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ ఇప్పుడు ఇటలీలో జరగనున్నట్టు సమాచారం.

తాజా సమాచారం ప్రకారం ప్రభాస్, పూజా హెగ్డే, రాధేశ్యామ్ టీమ్ మంగళవారం ఇటలీకి బయల్దేరారట. రేపటి నుంచి షెడ్యూల్ ప్రకారం షూటింగ్ మొదలు కానుందట. చాలా కాలం తరువాత ప్రభాస్ మళ్లీ షూటింగ్ లో పొల్గోనున్నాడు. ఇటలీలో రెండు వారాల పాటు చిత్రీకరణ జరగనుంది అని సమాచారం. పూజా హెగ్డే, ప్రభాస్ మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.