నవంబర్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు:పార్ధసారథి

137
Parthasarathy

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై స్పష్టత ఇచ్చారు తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ పార్ధసారథి. త్వరలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపిన ఆయన నవంబర్‌,డిసెంబర్‌ నెలల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.

ఇక ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది ఈసీ. గుర్తింపు పొందిన, న‌మోదైన‌ 50 పార్టీల్లో 26 పార్టీలు త‌మ అభిప్రాయాల‌ను తెలిపగా 13 పార్టీలు బ్యాలెట్ విధానానికే మొగ్గు చూపగా ఈవీఎంల ద్వారా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని 3 పార్టీలు కోరాయని ఈసీ వెల్లడించింది.