1292కి చేరిన కరోనా మరణాలు…

83
corona

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 1456 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 5గురు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,27,580కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 20,183 యాక్టివ్ కేసులుండగా 2,06,105 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 1292కి చేరింది.

గత 24 గంటల్లో 38,565 కరోనా పరీక్షలు చేయగా జీహెచ్‌ఎంసీలో 25, ఖమ్మంలో 89,నల్గొండలో 92,రంగారెడ్డిలో 98, భద్రాద్రి కొత్తగూడెం లో 82, మల్కాజ్ గిరిలో 98 కేసులు నమోదయ్యాయి.