కాంగ్రెస్ ‘స్క్రినింగ్ కమిటీ’ స్ట్రాటజీ?

45
- Advertisement -

టి కాంగ్రెస్ ఈ మద్య ఎంత దూకుడుగా వ్యవహరిస్తోందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ముఖ్యంగా కర్నాటక ఎన్నికల తరువాత పార్టీ తీరు, వైఖరి పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. నేతలు కూడా తామంతా ఒక్కటేననే భావనను కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వరుసగా సమావేశాలు, కమిటీలు నిర్వహిస్తూ నానా హడావిడి చేస్తున్నారు హస్తం నేతలు. ఆపార్టీ హైకమాండ్ కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇదిలా ఉంచితే ఈ ఏడాది చివర్లో తెలంగాణతో పాటు మద్య ప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలే పెట్టుకొని హామీలు, టికెట్లు, వంటి వాటిపై ముమ్మర కసరత్తులు చేస్తోంది..

ముఖ్యంగా తెలంగాణలో సర్వేల ఆధారంగానే టికెట్లు అని తేల్చి చెప్పిన కాంగ్రెస్.. అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రినింగ్ కమిటీలను తాజాగా ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో చైర్మెన్ గా కె మురళిధరన్ ఉండగా.. బాబీ సిద్దిఖ్, జిగ్నేశ్ వంటి వారిని సభ్యులు గా నియమించింది అధిష్టానం. ఇంకా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాణిక్ రావ్ ఠాకూర్ వంటివాటిని ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎన్నుకుంది. ఈ స్క్రినింగ్ కమిటీ ఇచ్చిన సలహాల సూచనల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరిగే అవకాశం ఉంది.

Also Read:Harishrao:పెరిగిన బీఆర్ఎస్ గ్రాఫ్‌..

ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవవడంతో అభ్యర్థుల ఎంపిక త్వరగా చేపట్టే అవకాశం ఉంది. ఇంకా హామీలు, మేనిఫెస్టో తయారీ వంటి అంశాలపై ఇప్పటికే తుది కసరత్తులు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల పార్టీ జాతీయ నేతలు తెలంగాణ టూర్ వేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మేనిఫెస్టో ప్రకటించి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని హస్తం పార్టీ భావిస్తోంది. పార్టీకి సంబంధించి తదుపరి కార్యాచరణలో స్క్రినింగ్ కమిటీ ముఖ్య భూమిక పోషించే అవకాశం ఉంది. మరి స్క్రినింగ్ కమిటీ ఎలాంటి స్ట్రాటజీతో అభ్యర్థుల ఎంపిక చేపడుతుందో చూడాలి.

Also Read:బీజేపీ సైన్యం రెడీ..అయిన డౌటే?

- Advertisement -