8 మందితో టీకాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్..

253
revanth batch congress
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్. 8 మంది అభ్యర్థులతో తొలిజాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ హైకమాండ్ సెకండ్ లిస్ట్‌ను ఇవాళ విడుదల చేయనుంది.

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అధ్యక్షతన సోనియా గాంధీ నివాసంలో శుక్రవారం రాత్రి సమావేశమైన కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) ఫస్ట్ లిస్ట్‌ను విడుదల చేసింది.తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి ఆర్‌.సి.కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అధిష్ఠానం సూచన మేరకు పోటీ చేస్తానని.. అదే సమయంలో గత శాసనసభ ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని హామీలు ఇచ్చిన వారికి న్యాయం చేయాలని కోరారు రేవంత్ రెడ్డి. నల్గొండ నుంచి పటేల్‌ రమేశ్‌రెడ్డి, జహీరాబాద్‌ నుంచి సుభాష్‌రెడ్డికి కచ్చితంగా టిక్కెట్‌ ఇవ్వాలని కోరారు.

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు..

మల్కాజ్‌గిరి – రేవంత్‌రెడ్డి
ఆదిలాబాద్ – రమేశ్ రాథోడ్
మహబూబాబాద్ – బలరాం నాయక్
పెద్దపల్లి – ఎ. చంద్రశేఖర్
కరీంనగర్ – పొన్నం ప్రభాకర్
జహీరాబాద్ – మదన్ మోహన్
చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
మెదక్ – గాలి అనిల్ కుమార్

పెండింగ్‌లో ఉన్న స్థానాలు

1. ఖమ్మం, 2. నల్గొండ, 3. భువనగిరి, 4. వరంగల్‌, 5. హైదరాబాద్‌, 6. సికింద్రాబాద్‌, 7. మహబూబ్‌నగర్‌, 8. నాగర్‌కర్నూల్‌, 9. నిజామాబాద్‌

- Advertisement -