- Advertisement -
తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వే విధి విధానాలు, అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లు వివరాలను మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి వివరించాం అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.
రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో ఖర్గే, రాహుల్ గాంధీ మేమిచ్చిన సమాచారం, వినతులను విన్నారు అని తెలిపారు. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్ లో చేర్చేలా పార్లమెంటులో పోరాడాలని కోరామని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
ఖర్గే, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరుగగా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కులగణన సర్వే వివరాలతో పాటు శాసనసభ ఆమోదించిన బీసీ బిల్లుపై వివరణ ఇచ్చారు.
Also Read:అనిల్ అంబానీకి ఈడీ షాక్
- Advertisement -

