Congress:కాంగ్రెస్ ఆ లొల్లి నిజమేనా?

70
- Advertisement -

టి కాంగ్రెస్ ను గత కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న అంశాలలో సి‌ఎం అభ్యర్థి ఎవరనే అంశం కూడా ఒకటి. ఆ పార్టీలో దాదాపు అరడజన్ మంది సి‌ఎం అభ్యర్థులు ఉన్నారని, ఒకవేళ హస్తం పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదికో సి‌ఎం మారతారనే విమర్శలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. ఆ విమర్శల్లో ఎంతో కొంత నిజం లేకపోలేదు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, సీతక్క.. ఈ నేతలంతా ఎవరికి వారు సి‌ఎం అభ్యర్థిగా ప్రకటించుకుంటూ ఉండడమే అందుకు కారణం. దీంతో కాంగ్రెస్ పార్టీ విజయం పదవుల కోసం తప్ప ప్రజాభివృద్ధి కోసం కాదనే వాదన బలంగా వినిపిస్తోంది. సి‌ఎం అభ్యర్థి రేస్ లో ఉన్న నేతలంతా కూడా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తూ పార్టీలోని లొసుగులను బయట పెడుతున్నారు.

తాజాగా సి‌ఎం అభ్యర్థి విషయంలో పోటీ నడుస్తోందని తాజాగా స్వయంగా రేవంత్ రెడ్డే వ్యాఖ్యానించడంతో.. ముందు అభివృద్ధి గురించి ఆలోచించకుండా ఏంటి ఈ గోల అని కాంగ్రెస్ నేతలను చూసి ప్రజలు ఈసడించుకునే పరిస్థితి ఏర్పడింది. తాను ఎప్పటికైనా సి‌ఎం అవుతానని రేవంత్ రెడ్డి చెప్పడం, సి‌ఎం అభ్యర్థి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని గతంలో భట్టి విక్రమార్క వ్యాఖ్యానించడం, తాను కూడా సి‌ఎం అభ్యర్థి రేస్ లో ఉన్నానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తరచూ చెబుతుండడం.. ఇలా నేతలంతా కూడా ప్రస్తుతం సి‌ఎం అభ్యర్థి హోదా చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలంతా కూడా పార్టీలో ఒకరికి ఒకరు ఎడమొఖం పెడమొఖం గానే ఉంటున్నారట. సి‌ఎం అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ లో లొల్లి నిజమేనని స్వయంగా రేవంత్ రెడ్డే స్పష్టం చేశారు. దీంతో హస్తం పార్టీలో ఈ లొల్లి ఇలాగే కొనసాగితే ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్న రీతిలో పార్టీ పరిస్థితి తయారవుతుందని రాజకీయవాదులు చెబుతున్నారు.

Also Read:వెల్లుల్లితో ప్రయోజనాలు!

- Advertisement -