Revanth:రేవంత్ రెడ్డి కాదు ఊసరవెల్లి!

54
- Advertisement -

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైఖరి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దురుసైన వ్యాఖ్యలు చేయడం, తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం, సొంత పార్టీలోనే ఇతర నేతలను అగౌరవంగా చూడడం రేవంత్ రెడ్డి వైఖరిని ప్రతిభింభిస్తుందని కాంగ్రెస్ లోనే చాలా మంది నేతలు అసహనం వెళ్లగక్కుతూ వచ్చారు. అందుకే రేవంత్ రెడ్డి విషయంలో మొదటి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేతలు వ్యతిరేకత చూపుతూనే ఉన్నారు. ఆయనపై ఉన్న ఎన్నో అవినీతి కేసులు ప్రజలకు తెలుసని, అలాంటి వ్యక్తిని పార్టీలోకి ఆహ్వానిస్తే కాంగ్రెస్ కు మచ్చగా మిగులుతుందని మొదటినుంచి ఆ పార్టీలోని కొందరు నేతలు వాపోతున్నారు.

అయినప్పటికి బొక్కలో ఉన్న ఎలుకకు మరో ఎలుక కనిపించినట్లు అవినీతి స్కామ్ లతో మునిగి పోయిన హస్తంపార్టీ.. మరో అవినీతిపరుడికి టీపీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఇదిలా ఉంచితే.. పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టడం లో రేవంత్ రెడ్డి సిద్దహస్తుదానే సంగతి మరోసారి రుజువైంది. కాంగ్రెస్ కు బద్ద శతృత్వ పార్టీగా ఉన్న టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి టీడీపీ పై ఉన్న ప్రేమను కనబరుస్తూ వచ్చారు. తనకు రాజకీయంగా ఓనమాలు నేర్పింది టీడీపీనే అని ఆయనే స్వయంగా చాలా సార్లు చెప్పుకోఃచారు. చంద్రబాబుపై తనకున్న ఇష్టాన్ని కూడా ఎన్నో సందర్భాల్లో బయటపెట్టారు రేవంత్ రెడ్డి.

గత వారం రోజుల క్రితం ఆయన ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో టీడీపీపై, చంద్రబాబుపై ఉన్న ప్రేమను బహిర్గతం చేశారు కూడా. అయితే ఇప్పుడేమే రంగు మార్చి టీడీపీతో తనకేం సంబంధం అన్న రీతిలో మాట్లాడుతుండటంతో గమనార్హం. తనకు టీడీపీతో ఎలాంటి సంబంధం లేదని, అధిష్టానం ఆదేశిస్తే ఏపీలో కాంగ్రెస్ తరపున టీడీపీ ప్రత్యర్థి గా బరిలో దిగడానికి కూడా సిద్దమే అని చెప్పుకొచ్చారు. దీంతో నిన్న మొన్నటి వరకు రేవంత్ రెడ్డి విషయంలో కాస్త సానుకూలంగా ఉన్న తెలంగాణ టీడీపీ శ్రేణులు ఇప్పుడు ఆయనను ఊసరవెల్లితో పోల్చుతున్నారు. తన స్వార్థం కోసం నమ్మిన పార్టీని గొంతు కోసే రకమని రేవంత్ రెడ్డిపై మండి పడుతున్నారు. మొత్తానికి పూటకో మాట మాట్లాడుతూ తాను ఏం చెప్పిన చెల్లుతుందనే ఢంభికంతో రేవంత్ రెడ్డి ఉన్నారని, ఆయనను తెలంగాణ ప్రజలు అందుకే పట్టించుకోవడం మానేశారని రాజకీయ అతివాదులు చెబుతున్నారు.

Also Read:వెల్లుల్లితో ప్రయోజనాలు!

- Advertisement -