తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడడంతో అన్ని పార్టీలు వడివడిగా ఎలక్షన్ మూడ్ లోకి వస్తున్నాయి. అధికార బిఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో కూడా దూసుకుపోతుంది. కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో 55 మంది అభ్యర్థులను ప్రకటించి రెండో జాబితా కోసం సిద్ధమౌతోంది. అటు బీజేపీ ఇంకా అభ్యర్థుల ఎంపికలో కసరత్తులు జరుపుతూనే ఉంది. కాగా విజయం మాదే అని జబ్బలు చారుస్తున్న హస్తం పార్టీలో తొలి జాబితా అభ్యర్థుల ప్రకటన తరువాత అసంతృప్త జ్వాలలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అసలు అభ్యర్థుల ఎంపిక ఆమోదయోగ్యంగా లేదని పార్టీలోని కిలక నేతలకు నచ్చినవారికే టికెట్ల కేటాయింపు జరిగిందని చాలమంది గగ్గోలు పెడుతున్నారు. దీంతో త్వరలో విడుదల చేయబోయే రెండో జాబితాతో అసంతృప్త వాదులను బుజ్జబించేలా చేయాలని హస్తం అగ్రనేతలు భావిస్తున్నారు..
రెండో జాబితాలో మెజారిటీ స్థానాలను బీసీలకు కేటాయించేలా ప్రణాళికలు రచిస్తున్నారట.ఎందుకంటే బీసీలకు అధిక మొత్తంలో సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఇక తొలి జాబితాలో మధు యాష్కీ గౌడ్, పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్ వంటి వారికి సీట్ల కేటాయింపు జరపలేదు. వీరంతా ఇటీవల సమావేశం అయి బీసీలకు ప్రధాన్యం ఇవ్వకపోవడంతో చర్చ జరిపరట. ఇక రెండో జాబితాలో ఆశించినట్లుగా బీసీలకు టికెట్లు కేటాయించకపోతే చాలమంది బీసీ నేతలు పార్టీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని ఆశావాహులు కూడా టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. దాంతో బీసీలకు మాత్రమే అధికార ప్రధాన్యం కల్పిస్తే ఈ వర్గాల నేతల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి హస్తం పార్టీ అగ్రనేతలు ఈ కన్ఫ్యూజన్ కు ఎప్పుడు తెర దించుతారో చూడాలి.
Also Read:BJP:అభ్యర్థులు కావాలండోయ్ !