కాంగ్రెస్ లో మంట.. చీలిక ఖాయమేనా?

44
- Advertisement -

టి కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య విభేదాలు కొత్తేమీ కాదు. మొదటి నుంచి కూడా ఆ పార్టీలో కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఎన్నికల దగ్గర పడడంతో పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, తామంతా ఒక్కటేనని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు హస్తం నేతలు. రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్స్ మద్య జరిగిన వార్ ఎపిసోడ్ ఎవరికీ తెలియనిది కాదు. ఇకపోతే ఈ వార్ ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంది. తాజాగా ఎన్నికల ముందు ఈ ఎపిసోడ్ హాట్ టాపిక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సి‌ఎం అభ్యర్థి విషయంలో పార్టీలో ముసలం నడుస్తున్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంటి సీనియర్ నేతలు గట్టిగా పోటీ పడుతున్నారు..

వీరంతా మొదటి నుంచి రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత కనబరుస్తున్నవారే. దాంతో రేవంత్ రెడ్డిని సి‌ఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఈ సీనియర్ నేతల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడడంతో పాటు పార్టీ రెండుగా చీలిపోవడం గ్యారంటీ. అందుకే ఎన్నికలకు కొద్ది సమయమే ఉన్నప్పటికి సి‌ఎం అభ్యర్థి విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అధిష్టానం. అయితే ఇంతలోనే కాంగ్రెస్ లోని కొంతమంది రేవంత్ రెడ్డి సి‌ఎం అభ్యర్థి అని ప్రస్తావించడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది.

Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే

గతంలో కాంగ్రెస్ నేత రామ్మోహన్ మాట్లాడుతూ కాంగ్రెస్ తరుపున రేవంత్ రెడ్డే సి‌ఎం అభ్యర్థి అని చెప్పగా సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇప్పుడు తాజాగా మరో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కూడా రేవంత్ రెడ్డే సి‌ఎం అభ్యర్థి అని చెప్పడం హాట్ టాపిక్ అయింది. అధిష్టానం ఇంకా కన్ఫర్మ్ చేయనప్పటికి ఇలా ఎవరికి వారు సి‌ఎం సి‌ఎం అభ్యర్థిని ప్రకటించుకుంటూ ఉండడంతో సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డిని సి‌ఎం అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీ విడేందుకు కూడా కొంతమంది నేతలు సిద్దంగా ఉన్నారట, మరి సి‌ఎం అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ లో చెలరేగిన మంట.. పార్టీలో చీలిక తీసుకురావడం గ్యారెంటీ అనే వాదన వినిపిస్తోంది.

Also Read:Bigg Boss 7 Telugu:హాట్‌ హాట్‌గా నామినేషన్స్ ప్రక్రియ‌

- Advertisement -