తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 65 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ముందు పెను సవాళ్లు ఛాలెంజ్ విసురుతున్నాయి. ఎన్నికల టైమ్ లో అధికారం కోసం అనేక హామీలను ప్రకటించిన హస్తం పార్టీ ఇప్పుడు వాటి అమలుకై ఎలా ముందుకు సాగనుంది అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఎన్నికల టైమ్ లో ప్రజాకర్షణ కోసం ఆరు గ్యారెంటీల పేరుతో ఆరు హామీలను ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చింది హస్తంపార్టీ. మహాలక్ష్మి పేరుతో ప్రతి మహిళకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం, అలాగే రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ఇంకా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం.
రైతు భరోసా పథకం కింద రైతులకు మరియు కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 మరియు వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఇంకా గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇంకా ఇందిరమ్మ ఇల్లు పేరుతో ఇల్లు లేని వారికి ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు రూ. ఐదు లక్షల ఆర్థిక సాయం. ఇంకా యువత కోసం యువ వికాసం పథకం అలాగే చేయుట కింద రూ.4000 పెన్షన్, మరియు ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల జీవిత భీమా.. ఇలా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలు లక్షల కోట్ల ఖర్చు తో కూడుకున్న అంశం. కాంగ్రెస్ ఈ పథకాలు అమలు చేయాలంటే ఏడాదికి రూ.50 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో ప్రజలపై పెను ఆర్థిక భారం పడే అవకాశం లేకపోలేదు.
ఫలితంగా నిత్యవసర ధరల పెరుగుదల, పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్నంటడం, తీవ్రమైన కరెంటు కోతలు ఏర్పడే అవకాశం ఉంది. మరి ఈ సవాళ్లను అధిగమించి హస్తం పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తుందా ? అంటే సందేహమే అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఆల్రెడీ ఇవే హామీలను ప్రకటించి కర్నాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అక్కడ ఈ హామీలను అమలు చేయడానికి మల్లగుల్లాలు పడుతోంది. మరి తెలంగాణలో కాంగ్రెస్ కు ఈ హామీలు సాధ్యమౌటాయా ? లేదా తెలంగాణ మరో కర్ణాటక కానుందా ? అనేది చూడాలి.
Also Read:కాంగ్రెస్ ‘ కేటిఆర్ ‘ స్థానాన్ని భర్తీ చేయగలదా?