దక్షిణాదిన జోష్.. ఉత్తరాదిన తుస్!

35
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని హస్తం పార్టీ తెగ ప్రయత్నిస్తోంది. అందుకే ఇండియా కూటమిలో భాగమై ఉంటూ.. ఉత్తరాదిన మరియు దక్షిణాదిన గట్టిగానే ఫోకస్ చేస్తోంది. అయితే ఉత్తరాది కంటే కూడా దక్షిణాది పైనే హస్తం హైకమాండ్ గట్టిగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మొన్న కర్ణాటక నిన్న తెలంగాణ రేపు ఆంధ్రప్రదేశ్.. ఇలా సౌత్ లో ఒక్క రాష్ట్రంపై పట్టు సాధించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారం సాధించగా, ఇక ముందు రోజుల్లో ఏపీ, తమిళనాడు, వంటి రాష్ట్రాల్లో కూడా పట్టు సాధించాలని చూస్తోంది. అయితే సౌత్ పై ఫోకస్ చేస్తూ నార్త్ లో బలం కోల్పోతోందా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి..

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఘోర పరాభవం ఎదురైంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న రాజస్థాన్ లో కూడా తాజా ఎన్నికలతో అధికారాన్ని చేజార్చుకుంది. ఇంకా మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో కూడా పూర్తిగా పట్టు కోల్పోయింది. ఫలితంగా ఆ రాష్ట్రాల్లో కమలం పార్టీ పాగా వేసింది. దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నార్త్ లో హస్తం పార్టీకి గట్టి షాక్ తగిలే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. సౌత్ లో ప్రాంతీయ పార్టీల హవానే ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పట్టు సాధిస్తున్నట్లు అనిపించినా.. ఆ తర్వాత ప్రాంతీయ పార్టీల నుంచి గట్టి పోటీ ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. ఇక నార్త్ లో పట్టు కోల్పోతే పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు ఆభిప్రాయ పడుతున్నారు. ఇక తాజాగా వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ లో కన్ఫ్యూజన్ మొదలైంది, పట్టు కోల్పోతున్న నార్త్ పై ఫోకస్ చేయాలా ? లేదా సౌత్ పైనే దృష్టి సారించలా ? అనే కన్ఫ్యూజన్ హస్తం పార్టీని గందరగోళంలో పడేసింది. మరి కాంగ్రెస్ ప్రణాళికలు ఎలా ఉంటాయో చూడాలి.

Also Read:కాంగ్రెస్ ‘ కే‌టి‌ఆర్ ‘ స్థానాన్ని భర్తీ చేయగలదా?

- Advertisement -