కాంగ్రెస్ తో కామ్రేడ్స్ దోస్తీ.. కుదిరేనా?

30
- Advertisement -

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా పొత్తుల వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. మునుగోడు బైపోల్ టైమ్ లో వామపక్షాలతో పొత్తులో ఉన్న బి‌ఆర్‌ఎస్… సాధారణ ఎన్నికలు వచ్చే సరికి కమ్యూనిస్టులకు దూరం జరిగింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్ వేగంగా పుంజుకుంది. ఇక్కడ ఈసారి ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వేలు చెబుతున్నాయి. అందుకే కమ్యూనిస్ట్ లతో పొత్తును కటిఫ్ చేసి ఒంటరిగా వెళ్ళేందుకు కే‌సి‌ఆర్ మొగ్గు చూపారు. అయితే బి‌ఆర్‌ఎస్ నుంచి దూరమైన తరువాత వామపక్షాలు ఏ పార్టీతో కలిస్తాయనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ హాట్ డిబేట్లకు కారణం అవుతోంది..

కాగా ప్రస్తుతం పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం వామపక్షాలు కాంగ్రెస్ తో కలిస్తే అవకాశాలు ఉన్నాయట. తాజాగా ( నేడు ) వామపక్ష నేతలతో కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఠాక్రే భేటీ అయ్యారు. ఈ సమావేశం తరువాత రెండు పార్టీల మద్య పొత్తు అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం సీట్ల కేటాయింపులో తలమునకలైయున్న కాంగ్రెస్.. ఒకవేళ కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే సీట్ల పంపకల్లో సర్దుబాటు చేయక తప్పదు. ఖమ్మం నల్గొండ జిల్లాలో బలంగా ఉన్న వామపక్షాలు సీట్ల విషయంలో రాజీ పడే అవకాశం ఉందా లేదా అనేది చెప్పలేము అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ కమ్యూనిస్ట్ పార్టీలు కోరిన సీట్లు కాంగ్రెస్ కేటాయిస్తే.. సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి జ్వాలలు రేగే అవకాశం ఉంది. అసలే ఆ రెండు జిల్లాలో సీట్ల కోసం హస్తం పార్టీలో టాఫ్ ఫైట్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వామపక్షాల విషయంలో హస్తం పార్టీ ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Also Read:Congress:ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ వెనుక వ్యూహామదే?

- Advertisement -