Harishrao:పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి

40
- Advertisement -

అన్ని వర్గాలు ఆత్మగౌరవంతో ఉండాలని సీఎం కెసిఆర్ చేస్తున్న ప్రయత్నంలో Veగంగా ఈరోజు సిద్ధిపేట రూరల్ లోని పలు గ్రామాకుల సంఘ భవనాలకు ప్రొసీడింగ్ కాపీలు అందించారు మంత్రి హరీష్ రావు. నియోజకవర్గ పరిధిలోని సిద్ధిపేట రూరల్ మండలంలోని రాంపూర్ గ్రామంలో రెడ్డి కమ్యూనిటీకి రూ.10 లక్షలు, బండచర్లపల్లిలో విలేజ్ ఫంక్షన్ హాల్ కి రూ.5 లక్షలు, చిన్నగుండవెళ్లి రూ.10 లక్షలు ముదిరాజ్ కమ్యూనిటీ, ఇర్కోడ్ రూ.10 లక్షలు విలేజ్ ఫంక్షన్ హాల్ అందించారు.

తొర్నాల రూ.3 లక్షలు రజక కమ్యూనిటీ హాల్, తొర్నాల రూ.6.50 లక్షలు మున్నూరు కాపు కమ్యూనిటీ హాల్, అలాగే నంగునూరు మండలం కొండంరాజ్ పల్లి రూ.15 లక్షలు విలేజ్ ఫంక్షన్ హాల్ భవన నిర్మాణం కోసం నిధులను మంజూరు చేసి ఆయా గ్రామ ప్రజాప్రతినిధులు, కులసంఘ బాధ్యులకు మొత్తం కలుపుకుని రూ.59.50 లక్షల ప్రొసీడింగ్ కాపీలు అందించారు హరీష్ రావు.

Also Read: కాంగ్రెస్ తో కామ్రేడ్స్ దోస్తీ.. కుదిరేనా?

- Advertisement -