షర్మిలకు నో ఎంట్రీ.. బ్రేకులు వేస్తోందేవరు?

50
- Advertisement -

గత కొన్నాళ్లుగా తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతుందని, కాంగ్రెస్ తరుపున పాలేరు నుంచి పోటీ చేయబోతుందని ఇలా రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఐతే పార్టీ విలీనంపై షర్మిల ఇంతవరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ లోని చాలమంది నేతలు షర్మిల రాకను స్వాగతిస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో షర్మిల కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయమే అని భావించరంతా. కానీ షర్మిలా మాత్రం ఇంకా మౌనం పాటిస్తూనే ఉంది. దీనికి కారణం కాంగ్రెస్ లోని కొందరు బడా నేతలు షర్మిల కాంగ్రెస్ లో చేరడాన్ని వ్యతిరేకిస్తున్నారట. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. షర్మిల కాంగ్రెస్ లో చేరడాన్ని బహిరంగంగానే తప్పుబట్టారు..

టి కాంగ్రెస్ కు షర్మిల అవసరత లేదని తేల్చి చెప్పారు. మరి రేవంత్ రెడ్డి షర్మిల ఎంట్రీని ఈ స్థాయిలో వ్యతిరేకించడానికి కారణం కూడా లేకపోలేదు. గతంలో షర్మిల రేవంత్ రెడ్డిపై ఘాటైన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమెను ఆహ్వానిస్తే.. బి‌ఆర్‌ఎస్ నుంచి ఎదురయ్యే విమర్శలు తట్టుకోవడం కష్టమే. అలాగే గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించారు. అందువల్ల ఇప్పుడు షర్మిలను కాంగ్రెస్ లో చేర్చుకుంటే ప్రజలు ఎంతవరకు ఆధారిస్తారనేది కూడా సందేహమే. ఆమె పార్టీ స్థాపించి తెలంగాణ రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నప్పటికి.. తెలంగాణ బిడ్డగా షర్మిలను గుర్తించడం లేదు రాష్ట్ర ప్రజలు. అందువల్ల ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తే కాంగ్రెస్ కు దేబ్బే అనేది కొందరి అభిప్రాయం. ఈ కారణాల చేతనే రేవంత్ రెడ్డి తో పాటు మరికొందరు నేతలు కూడా షర్మిల కాంగ్రెస్ లో చెరకుండా అడ్డుపడుతున్నారని ఇన్ సైడ్ టాక్. మరి ఎన్నికల సమయానికి వైఎస్ షర్మిల అడుగులు ఎటు పడతాయో చూడాలి.

Also Read:పవన్ లేకుండానే OG!

- Advertisement -