బెయిలా,కస్టడీనా.. టెన్షన్ లో టీడీపీ?

21
- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయి నెల రోజులు దాటింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారాయన. అధినేత అరెస్ట్ అయినది మొదలుకొని బెయిల్ కోసం టీడీపీ శ్రేణులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సరైన ఫలితాలు మాత్రం రావడం లేదు. దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లు లూథ్రా, సాల్వే వంటి వారిని రంగంలోకి దించినప్పటికి కేసులో వాయిదాల పర్వం కొనసాగుతుండే తప్పా.. బెయిల్ పై స్పష్టత మాత్రం రావడం లేదు. కేవలం స్కిల్ స్కామ్ మాత్రమే కాకుండా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్, ఫైబర్ గ్రేడ్ స్కామ్, అంగళ్ళు… వంటి ఇతరత్రా కేసుల తీర్పు కూడా వాయిదాలు పడుతూ వస్తున్నాయి. .

అయితే వీటన్నిటిపై రేపు తుది తీర్పులు వెలువడే అవకాశం ఉంది. దీంతో అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది, స్కిల్ స్కామ్ విషయంలో మరింత విచారణ అవసరమని ఏపీ సిఐడి కోరిక మేరకు ఏసీబీ కోర్టు ఈ నెల 19 వరకు రిమాండ్ పొడిగించిన సంగతి తెలిసిందే. కానీ బెయిల్ అంశంపై మాత్రం తుది తీర్పు సోమవారానికి వాయిదా వేసింది. అటు అమరావతి రింగ్ రోడ్ అంశం, అంగళ్ళ కేసు వంటి వాటిపై హైకోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. అయితే ఇన్ని కేసులు చుట్టిముట్టిన నేపథ్యంలో ఏదో ఒక దాంట్లో బెయిల్ వచ్చిన మరో కేసులో బాబు జైలు పాలు అవ్వక తప్పదా అనే సందేహాలు టీడీపీ శ్రేణులను వెంటాడుతున్నాయట. మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే పార్టీకి జరగాల్సిన నష్టం చాలానే జరిగిపోయింది. ఇదిలాగే కొనసాగితే ప్రజల్లో పార్టీ పై ఉండే విశ్వసనీయత కోల్పోయే ప్రమాదం ఉందని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారట. దీంతో రేపు వెలువడే తీర్పు పై టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబుకు బెయిల్ వస్తుందా లేదా అనేది రేపు తేలనుంది.

- Advertisement -