పట్టణ స్థానిక సంస్థల సంస్కరణల్లో తెలంగాణ భేష్..

229
ts
- Advertisement -

పట్టణ స్థానిక సంస్థల్లో సంస్కరణలు అమలు చేసిన మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ నేపథ్యంలో రూ.2,508 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. పట్టణ స్థానిక సంస్థల్లో సంస్కరణలు అమలు చేసినందుకు రాష్ట్రానికి కల్పించిన కేంద్ర ఆర్ధిక శాఖ ఈ వెసులుబాటు కల్సించింది.

ఇప్పటి వరకు వన్‌ నేషన్‌-వన్‌ రేషన్‌ కార్డును 10 రాష్ట్రాలు అమలు చేశాయి. ఇప్పటి వరకు ఏడు రాష్ట్రాలు సులభతర వాణిజ్య సంస్కరణలు అమలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. పట్టణ స్థానిక సంస్థల్లో సంస్కరణలు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రలు అమలు చేశాయి.

- Advertisement -