కేసీఆర్‌కు వైద్య పరీక్షలు పూర్తి.. అసలు విషయం చెప్పిన డాక్టర్లు..

64
kcr

యశోద ఆస్పత్రిలో సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు పూర్తి అయ్యాయి. వైద్య పరీక్షల పూర్తి అనంతరం సీఎం ప్రగతిభవన్‌కు బయల్దేరి వెళ్లారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటంతో సీఎంకు నిన్న వైద్య పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు సీఎం ఈరోజు ఆస్పత్రికి వెళ్లి మరికొన్ని వైద్య‌ ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు మీడియాకు వివరాలు తెలిపారు.

ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చేయించుకునే వైద్య పరీక్షలనే సీఎం కేసీఆర్ ఈరోజు కూడా చేయించుకున్నారని, ఆరోగ్యపరంగా ఆందోళన చెందాల్సిన అంశాలేవీ లేవని వెల్లడించారు. ముఖ్యంగా ఆయనలో కరోనా లక్షణాలు లేవని వివరించారు. సీటీ స్కాన్ చేశామని, ఆ నివేదిక శుక్రవారం వస్తుందని తెలిపారు. కేసీఆర్‌కు ఎమ్మారై స్కానింగ్ అవసరంలేదని, ఆయన విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని తెలిపారు.