- Advertisement -
ఢిల్లీలో కరోనా వైరస్ తీవ్రంగా విస్తరిస్తోంది. తాజాగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. కమిషనర్ ఆఫీసులో పనిచేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తెలింది. అంతేకాదు ఉద్యోగి కుటుంబ సభ్యులైన మరో ఇద్దరికి కోవిడ్-19 పాజిటివ్ అని తెలిసింది. దీంతో ఆఫీసు మిగతా సిబ్బంది అందోళ చేందుతున్నారు.
వెంటనే స్టాఫ్ క్వార్టర్స్, తెలంగాణ, ఏపీ భవన్ పరిసర ప్రాంతాలను రెండు రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లు సంయుక్తంగా తనిఖీ చేశారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి తీసుకోవలసిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఏపీ, తెలంగాణ భవన్ పరిసరాలను, స్టాఫ్ క్వార్టర్స్ ను పారిశుధ్య సిబ్బందితో శానిటైజ్ చేయించారు. అలాగే భవన్ పరిసర ప్రాంతాల్లో ఇతరుల రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించారు.
- Advertisement -