ముఖ్యమంత్రి సహాయనిధికి ఈరోజు కూడా పలువురు విరాళాలు అందించారు. ఈరోజు సుమారు 30 మంది ప్రగతిభవన్లో మంత్రి కే తారకరామారావుని కలిసి కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల సహాయం కోసం విరాళాలు ఇచ్చి వాటికి సంబంధించిన చెక్కులను అందజేశారు. ఈరోజు 4 కోట్ల 70 లక్షల రూపాయల విరాళాలు ముఖ్యమంత్రి సహాయనిధి అందాయి
విరాళాలు అందించిన వారి వివరాలు:
• మంత్రి సిహెచ్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ 50 లక్షల రూపాయల విరాళాన్ని మంత్రి కేటీఆర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి అందించింది. మల్లారెడ్డి ఆధ్వర్యంలో పలువురు ప్రకటించిన విరాళాల కు సంబంధించిన సుమారు 47 లక్షల రూపాయల విలువైన 36 చెక్కులను కేటీఆర్ కి మల్లారెడ్డి అందించారు. వీటితోపాటు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలకు తరఫున మరో 25 లక్షల రూపాయల చెక్కు సైతం అందించారు
• HES ఇన్ఫ్రా ఎండి ఐవిఆర్ కృష్ణంరాజు 50 లక్షల రూపాయల చెక్కుని మంత్రి కేటీఆర్ అందించారు
• కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు అందించిన విరాళాల తాలూకు 40 లక్షల రూపాయల విలువైన చెక్కులను కేటీఆర్ కి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అందించారు
• WOXEN బిజినెస్ స్కూల్ కి చెందిన 25 లక్షలు రూపాయల విరాళాన్ని ఆ సంస్థ ఎండి విన్ పూల అందించారు.
• రాజరాజేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ, ఆర్ ఏ కెమ్ ఫార్మా లిమిటెడ్, ఎన్ ఎస్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ యం ఆర్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 25 లక్షల చొప్పున చెక్కులను అందించారు
• ఆజాద్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్21 లక్షల రూపాయల చెక్కును అందించారు
• Accurate గ్రీన్ videos 15 లక్షల రూపాయలను మంత్రి కేటీఆర్ కి యంఏల్యే కెపి వివేకనంద ద్వారా అందించారు
• స్కైస్ బిజినెస్ సర్విసెస్ లిమిటెడ్ 11 లక్షలు
• సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్మన్ యుగంధర్ రావు 10 లక్షలు
• మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ తరపున టిఆర్ఎస్ పార్టీ నాయకుడు డు మర్రి రాజశేఖర్ రెడ్డి 10 లక్షల రూపాయల చెక్కును మంత్రి కేటీఆర్ కి అందించారు
• ఇన్ స్టిస్టూట్ అప్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, సెయింట్ మార్టిస్ చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ సొసైటీ, టెక్ సిస్టమ్స్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 10 లక్షల చొప్పున చెక్కులను మంత్రి కేటీఆర్ కు అందించారు
• పడాల రామి రెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆరు లక్షల రూపాయలను సి ఎం ఆర్ యప్ కి అందించింది
• లహరి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మరిస్టా ఇన్ ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్, జోగిని పల్లి చంద్రశేఖర రావు, జోగినిపల్లి సుధీర్ 5 లక్షల చొప్పున సీఎంఆర్ఎఫ్ కి విరాళంగా ప్రకటించారు
• ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సొసైటీ ఆప్ సెయింట్ అన్నె ఐదు లక్షల రూపాయల చెక్కుని మంత్రి కేటీఆర్ కి అందించింది
• స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జి రాజేశం గౌడ్ రెండు లక్షల రూపాయల మంత్రి కేటీఆర్ కి అందించారు