ఎవరు గెలిచినా…12నే ముహుర్తం..!

193
kcr governor
- Advertisement -

2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు సర్వత్రా ఉత్కంఠను రేపుతున్నాయి. ఇక తెలంగాణలో టీఆర్ఎస్,మహాకూటమి మధ్య పోరు జరుగగా ఎవరికి వారే విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మెజార్టీకి అవసరమైన సంఖ్యను ఎవరు సాధించినా సీఎం ప్రమాణ స్వీకారానికి డిసెంబరు 12నే ముహూర్తం ఖరారు చేసుకున్నారనే ప్రచారం సాగుతోంది. మంత్రుల విషయంలో స్పష్టత లేకపోయినా సీఎం ప్రమాణ స్వీకారం మాత్రం బుధవారం ఉంటుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే ఆ రోజు పంచమి తిథి మంచి రోజు కావడం, తర్వాత మంచి రోజులు లేకపోవడంతో రెండు పార్టీలూ 12నే ముహూర్తంగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

టీఆర్‌ఎస్‌ మ్యాజిక్ ఫిగర్‌ను చేరిన వెంటనే టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ నిర్వహించి, కేసీఆర్‌ను తమ నేతగా ఎన్నుకోనున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం కూడా డిసెంబరు 12న జరుగుతుందని సమాచారం. కేసీఆర్‌తోపాటు పరిమిత సంఖ్యలో మంత్రులు కూడా
ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉండనుందని టాక్.

నియోజకవర్గాల వారీగా రిటర్నింగ్‌ అధికారులు గెలిచిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు జారీ అందజేసి, ఆ సమాచారాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి తెలియజేస్తారు. ఈ సమాచారం ఆధారంగా ఎన్నికల ప్రధాన అధికారి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారంటే.. కొత్త అసెంబ్లీ ఏర్పాటైనట్టే. అప్పటికే మేజిక్‌ ఫిగర్‌ దాటిన పార్టీ తమ శాసనససభాపక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని ఎల్పీ నేతను ఎన్నుకుంటుంది.

- Advertisement -