పబ్లిక్‌ గార్డెన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న కేసీఆర్‌

124
kcr
- Advertisement -

ప్రగతి భవన్‌లో ఏర్పాటైన రాష్ట్ర కేబినెట్‌ మీటింగ్‌లో 2022 సెప్టెంబర్ 17 ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాల‌ని కేబినెట్ నిర్ణయించింది. సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా 17న పబ్లిక్‌ గార్డెన్స్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం నెక్లెస్‌ రోడ్‌ నుంచి ఎన్టీఆర్‌ స్టేడియం వరకు భారీ ఊరేగింపు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించనున్నారు.

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంలో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని మంత్రులను అధికారులను సీఎం కేసీఆర్‌ అదేశించారు. 18న అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించాలని సూచించారు. తెలంగాణ స్ఫూర్తిని, సాంస్కృతిక కార్యక్రమాలను నలుదిక్కులా వ్యాపించేలా నిర్వహించాలన్నారు. అలాగే ఈ నెల 17న రాష్ట్రంలోని వెనుకబడిన బంజారా, ఆదివాసీ భవన్‌లను కూడా ప్రారంభోత్సవం చేయనున్నారు.

 

- Advertisement -