పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో కోల్ కతాలో కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రత్యేక విమానంలో ఎంపీలు కవిత, కే కేశవరావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ సీఎం తో వెళ్ళారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోల్‌కతాలోని పశ్చిమబెంగాల్ చేరుకున్నసందర్భంగా సీఎం కేసీఆర్ కు ఘనస్వాగతం లభించింది.
అక్కడి నుంచే నేరుగా పశ్చిమ బెంగాల్ సెక్రటేరియట్ కు చేరుకున్న సీఎం కేసీఆర్ కు.. పుష్పగుచ్చం అందించి స్వయంగా స్వాగతం పలికారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కేసీఆర్ కూడా మమతకు పుష్పగుచ్ఛం అందించి దన్యవాదాలు తెలిపారు. అనంతం మమత సీఎం కేసీఆర్‌తో సహా తెలంగాణ ప్రతినిధులను సచివాలయంలోకి తీసుకెళ్ళారు.
కాగా మమతా బెనర్జీతో సీఎం కేసీఆర్ సమావేశమై ..ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకత, ప్రస్తుతం దేశంలోని రైతుల పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై వీరి చర్చ చర్చించనున్నారు. 7 గంటలకు కోల్ కతాలోని కాళీమాత ఆలయాన్ని దర్శించుకోనున్నారు కేసీఆర్. ఆ తర్వాత హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు..