అమిత్‌ షాతో సీఎం కేసీఆర్ భేటీ..

602
- Advertisement -

సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు సాయంత్రం 04:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు.రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీకి అభినందనలు తెలపనున్నారు సీఎం కేసీఆర్‌. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. అంతకుముందే మధ్యాహ్నం 1.30గంటలకు నార్త్ బ్లాక్‌లో కేంద్రహోంమంత్రి అమిత్ షాతో కేసీఆర్ భేటీ కానున్నారు.

kcr

కేసీఆర్ రెండోసారి సీఎం అయిన తర్వాత గతేడాది డిసెంబర్ 26న మోదీని కలిశారు. 9 నెలల గ్యాప్ తర్వాత మళ్లీ ఆయనతో భేటీ కాబోతున్నారు.కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను పెంచడంతోపాటు రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని ప్రధానిని సీఎం కోరనున్నారు.

- Advertisement -