స్వతంత్ర భారత స్ఫూర్తిని ఈ తరం పిల్లలకు యువకులకు తెలియాలని… మేమంతో కృషి చేశామని సీఎం కేసీఆర్ చెప్పారు. గాంధీ నడయాడిన ఈ భారతదేశం ప్రపంచ మానవాళికి ఇచ్చిన సందేశమైన సర్వమానవ సౌభాతృత్వాన్నికి ఆయుధమైన సత్యం, శాంతి, అహింసా సిద్ధాంతాలను…. ఈ తరంకు తెలియాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో గాంధీ చలనచిత్రం ప్రదర్శనను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 22 లక్షల మంది విద్యార్థులు చూశారు వారిలో కేవలం 10శాతం మంది పిల్లలు గాంధీ ఆలోచనలను పునికిపుచ్చుకుంటే భవిష్యత్‌లో భారతదేశం మహోన్నత్త స్థితికి చేరుకుంటుందని నా ప్రగాఢ విశ్వాసం. నేటి బాలలే రేపటి పౌరులు… వారి శక్తి సామర్థ్యాలు పూర్తి స్థాయిలో వినియోగిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. ఇటువంటి స్ఫూర్తి ముందు కూడా కొనసాగాలని అకాంక్షిస్తున్నాను. గాంధీ చూపిన మార్గంలో దేశం పురోగమించాలని అకాంక్షిస్తున్నాను అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
గాంధీ బాట మనందరికీ ఆదర్శం :సీఎం కేసీఆర్
- Advertisement -
- Advertisement -