యాదాద్రి ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సీఎం కేసీఆర్, ఆయన ధర్మపత్ని శోభ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ దివ్య విమాన గోపురమునకు బంగారు తాపడం కోసం.. కేజీ 16 తులాల బంగారాన్ని విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని కేసీఆర్ మనుమడు హిమాన్షు ఆలయ ధర్మకర్తలకు అందించారు. పూజల అనంతరం కేసీఆర్ కుటుంబ సభ్యులను వేద పండితులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా దర్శనానికి వచ్చిన కేసీఆర్కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.
సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, సుధీర్ రెడ్డి, జీవన్ రెడ్డి, వైటీడీఏ చైర్మన్ కిషన్ రావు, ఆలయ ఈవో గీతా రెడ్డి ఉన్నారు.