Revanth:రేవంత్ కు ‘భయం’ పట్టుకుందా?

16
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సి‌ఎం పదవి విషయంలో భయం పట్టుకుందా ? తనపై కుట్ర జరుగుతోందని రేవంత్ చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి ? రేవంత్ ను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నదెవరు ? ఇలాంటి ప్రశ్నలు తెలంగాణ పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి. ఇంతకీ అసలు విషయమేమిటంటే.. తాజాగా కొడంగల్ లో పర్యటించిన రేవంత్ రెడ్డి అక్కడ చేసిన వ్యాఖ్యాలే ఇందుకు కారణం. మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్ లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు, రేవంత్ రెడ్డిని కిందకు లాగేందుకు కుట్ర జరుగుతోందని వ్యాఖ్యానించారు. రేవంత్ ను దెబ్బ తీయడానికి గూడుపుఠాని జరుగుతోందని, కొందరు పన్నాగాలు పన్నుతున్నారని రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. .

ఆయన చేసిన ఈ వ్యాఖ్యాలే ఇప్పుడు తెలంగాణ పోలిటికల్ సర్కిల్స్ లో చిచ్చు పెడుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేయడానికి పార్టీలోని అంతర్గత అసమ్మతులే కారణం అనేది కొందరి అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి విషయంలో సీనియర్ నేతలు కొంత వ్యతిరేకత చూపుతూ వచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినప్పుడు కూడా సి‌ఎం పదవి విషయంలో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారు రేవంత్ రెడ్డిని విభేదిస్తూ వచ్చారు. అప్పటి నుంచి రేవంత్ రెడ్డికి సి‌ఎం పదవిపై తన వారి నుంచే ముప్పు పొంచి ఉందనే వాదన గట్టిగానే వినిపిస్తూ వచ్చింది.

ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి కూడా తన వెనుక కుట్ర జరుగుతోందని స్వయంగా చెప్పడంతో త్వరలోనే రేవంత్ రెడ్డికి పదవి గండం తప్పదనే టాక్ వినిపిస్తోంది. అయితే ఆయన కోడంగల్ అభివృద్ది విషయంలో ఈ తరహా వ్యాఖ్యలు చేసినప్పటికీ.. పరోక్షంగా పార్టీలోని పరిస్థితులనే రేవంత్ ప్రస్తావించారనేది చాలమంది అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ అనగానే అంతర్గత కుమ్ములాటలకు కేరాఫ్ అడ్రస్.. ఈ నేపథ్యంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు లోక్ సభ ఎన్నికల ముందు పోలిటికల్ హీట్ పెంచుతున్నాయి. మరి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు తవిస్తాయో చూడాలి.

Also Read:వెంకటేష్ -దిల్ రాజు..ప్రొడక్షన్ నెం 58

- Advertisement -