సెప్టెంబర్ 17.. తెలంగాణ జాతీయ సమైక్యతా దినం

65
kcr
- Advertisement -

రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన‌ తెలంగాణ కేబినెట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హైదరాబాద్‌ సంస్థానంలోని నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడుతూ తెలంగాణ వ్యాప్తంగా… 1940వ దశకంలో చేపట్టిన రైతాంగ పోరాటం ఫలించి…. సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ రాజ్యం భారత్‌ యూనియన్‌లో కలసిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా దినం పాటించాలని కేబినెట్‌ నిర్ణయించింది.

రాచరిక పాలనను అంతం జరిగిన తర్వాత తెలంగాణ సమాజ పరిణామక్రమంలో భాగంగా హైదరాబాద్‌, ఆంధ్రా ప్రాంతం కలిసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా 1956 1నవంబర్‌న ఏర్పడింది. కాగా 2014 జూన్‌2న ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నాము. ఈ సందర్భంగా 2022 సెప్టెంబర్17 నాటికి 75 సంవత్సరాల్లోకి అడుగిడుతున్న వేళ…. 2022 సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’ గా పాటించాల‌ని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సెప్టెంబర్ 16, 17, 18 తేదీలల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది.

- Advertisement -