నేస్తమా తీసుకో రెయిన్‌కోట్‌

113
raincoat
- Advertisement -

ఈ భూప్రపంచంలో కుక్క మొట్టమొదటి మానవ నేస్తం. కుక్క పిల్లలంటే చాలామందికి ఇష్టం. వివిధ రకాల జాతుల్లో, వివిధ రకాల కుక్కలను పెంచుకుంటున్నారు. గ్రామీణం నుంచి పట్టణాల వరకు కుక్కలను పెంచుకోవడం పరిపాటి. ఏకంగా కొందరైతే వాటికి ముందు ఫేడ్‌గ్రీ ఇచ్చేంత వరకు వాళ్లు ఏం ముట్టుకోరు. కొంత మందైతే ఏకంగా సొంత ఇంటి మనుషుల చూసుకుంటారు. మరి కొందరైతే కుక్కలు చనిపోతే వాటికి ఖననం చేస్తారు. ఇంకోందరు వాటికి పెళ్లిళ్లు చేస్తారు.

ఇంటర్‌నెట్‌లో పెంపుడు కుక్కలకు సంబంధించిన వీడియోలు తరుచూ వస్తుంటాయి. తాజాగా రెయిన్‌కోట్‌ వేసుకోని వర్షంలో పరుగెత్తుతున్న కుక్కపిల్లను చూశారా…ప్రస్తుతం ఇది ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను డాగ్స్‌ ఆఫ్‌ ఇన్‌స్టాగ్రాం అనే యూజర్‌ ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేశారు. ఓ చిన్న కుక్కపిల్ల పసుపురంగు రెయిన్‌కోట్‌ ధరించి వర్షంలో పరుగెత్తుకుంటూ వచ్చి ఇంట్లోకి చేరింది. ఆ రెయిన్‌కోట్‌ను కుక్కపిల్ల కోసమే ప్రత్యేకంగా తయారు చేయించారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు లవ్‌ ఎమోజీలతో కామెంట్‌ బాక్స్‌ను నింపేస్తున్నారు. ఇప్పటివరకూ లక్షమందికిపైగా వీడియోను లైక్‌ చేశారు. తమ కుక్కపిల్లకి కూడా ఇలాంటి రెయిన్‌కోట్‌ ఇస్తామని కొందరు కామెంట్‌ చేశారు. మరీ ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి ఇన్‌స్టాలోకి వెళ్లి డాగ్స్‌ ఆఫ్‌ ఇన్‌స్టాగ్రాం అనే సెర్చ్‌ చేయగానే ఈ రెయిన్‌కోట్‌ డాగ్‌ కనిపిస్తుంది. చూసి ఏంజాయ్‌ చేయండి.

 

- Advertisement -