CMKCR: పారిశుధ్య కార్మికులకు మేడే కానుక

74
- Advertisement -

మేడే కానుకగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. పారిశుధ్య కార్మికులకు వేతనం రూ. వెయ్యి పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది కార్మికులకు లబ్ధి చేకూరనున్నది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ, జలమండలి, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల వేతనాలు పెరగనున్నాయి. పెరిగిన వేతనాలు తక్షణమే అమలులోకి వస్తాయని సీఎం తెలిపారు.

సఫాయన్న నీకు సలాం అన్న అనే నినాదంతో పారిశుధ్య కార్మికుల కృషిని గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం వారి సంక్షేమానకి అభవృద్ధికి కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ పల్లెలు పట్టణాలు గుణాత్మకమైన అభివృద్ధిని సాధించడంలో పారిశుధ్య కార్మికుల శ్రమ గొప్పదన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన పల్లెలు, పట్టణాలకు అవార్డులు రావడం వెనుక వీరి కృషి దాగి ఉన్నదని సీఎం తెలిపారు.

Also Read: ఏపీకి కే‌సి‌ఆరే దిక్కు !

పల్లెలు, పట్టణాల్లో నాటి, నేటి పరిస్థితులకు ఎంతో స్పష్టమైన తేడా ఉన్నదని సీఎం అన్నారు. కార్మికుల కష్టసుఖాలను తెలుసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడూ వారి జీతాలను పెంచుకుంటూ వారికి అండగా నిలబడిందని అన్నారు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై పారిశుధ్య కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Also Read: కన్నడ రాజకీయాల్లో ఆయనది చెరగని ముద్ర..

- Advertisement -