ప్రస్తుత వేసవి సీజన్‌లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అప్రమత్తతతో వ్యవహరిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి,కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ ప్రదీప్ కుమార్ సిన్హాకు తెలిపారు. మంగళవారం కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ ప్రదీప్ కుమార్ సిన్హా వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వేసవి తీవ్రత, వడగాలులు, కరువు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నీటిపారుదల రంగంపై ప్రత్యేక దృష్టి సారించామని, బడ్జెట్‌లో అత్యదిక నిధులు ఇరిగేషన్ రంగానికి కేటాయిస్తున్నామని, మిషన్ కాకతీయ ద్వారా 46531 చెరువులను పునరుద్దరించామని తెలిపారు. గౌరవ ప్రధాన మంత్రి 2 సంవత్సరాల క్రితం మిషన్ భగీరథను ప్రారంభించారని, ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీటిని అందిస్తున్నామని అన్నారు. జూలై నెలలో కాళేశ్వరం మొదటి దశ పూర్తవుతుందని కేంద్ర క్యాబినెట్ సెక్రటరీకి తెలిపారు.
ప్రధాన రిజర్వాయర్లలో గత సంవత్సరం కంటే తక్కువ నిల్వలు ఉన్నాయని వచ్చే రుతుపవనాల ద్వారా మంచి వర్షాలు కురుస్తాయన్న అశాభావంతో ఉన్నామన్నారు. మంచినీటి సెక్యూరిటీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మంచినీటి సమస్య తలెత్తకుండా చూస్తున్నామన్నారు. తెలంగాణలో ఏప్రిల్ నెలలో 6 రోజులు, మే నెలలో 10 రోజులు వడగాలులు వీచాయని, జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఆదేశాలు జారీచేస్తు అప్రమత్తం చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నారు.
కర్ణాటక రాష్ట్రం 2 టి.యం.సి లు నీరు విడదల చేసినందులకు కృతజ్ఞతలు తెలిపారు. వివిధ రాష్ట్రాలలో Drought మేనేజ్ మెంట్ కార్యాచరణ ప్రణాళికల అమలు, భూగర్బజలాలు, విద్యుత్ సరఫరా, దేశ వ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటి నిల్వలు, మంచినీటి సరఫరా, రుతుపవనాల రాక, నీటి నిర్వహణ, డాటా సేకరణ, ఎనాలిసిస్ , తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి తదితరులు పాల్గొన్నారు.