హైదరాబాద్ ఎచ్ఐసీసీ నోవాటల్‌లో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ -ఆయిల్ పామ్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్, కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ మాట్లాడుతూ, కోవిడ్ సమయంలో కూడా రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచింది. మన దేశం కృషి ప్రధాన్… ధర్మ ప్రధాన్… ప్రధాని మోదీ ఎల్లప్పుడూ రైతుల కోసం ఆలోచిస్తారు. ఆత్మనిర్భర్ భారత్ కోసం లక్ష కోట్లు ఖర్చుచేస్తున్నామన్నారు.
పామ్ ఆయిల్ రంగంలో బాగా రాణించాలి. పామ్ ఆయిల్ సాగు చేసేవాళ్లకు సబ్సిడీ అందజేస్తాము. విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మన దేశం రావాలని తోమర్ తెలిపారు. 18లక్ష ల ఎకరాలు పామ్ ఆయిల్ పండించాలని లక్ష్యం పెట్టుకోవాలి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వలకు అండగా ఉంటుంది. తెలంగాణ రాబోయే రోజుల్లో ఆయిల్ పామ్ సాగులో దేశంలో నెంబర్ 1స్థానంలో ఉంటుందని నాకు నమ్మకం వుంది అన్నారు.సొయా బీన్, ఆవాల సాగు కూడా బాగా చేయాలి. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటల వైపు రైతులు వెళ్ళాలని సూచించారు.నార్త్, ఈస్ట్ రాష్టాలు ఆయిల్ పామ్‌లో ముందున్నాయని పేర్కొన్నారు.
కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి మాట్లాడుతూ, 25లక్షల టన్నులు ఆయిల్ అవసరం ఉంటే, మన దేశంలో కేవలం 12లక్షల టన్నులు మాత్రమే ఆయిల్ లభిస్తుంది. ఆయిల్ కోసం బయట దేశాల నుండి దిగుమతి చేసుకునే పరిస్థితి వుంది. అన్ని రకాల సౌకర్యాలు ఉండి కూడా మనం ఆయిల్ సాగు చేయలేకపోతున్నాం. పామ్ ఆయిల్ సాగు చేస్తే మంచి లాభాలోస్తాయని సూచించారు.
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో పామ్ ఆయిల్ సాగు చేస్తున్నాం. తెలంగాణలో సాగుకి నీళ్ల ఇబ్బంది లేకుండా పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు అందుబాటులోకి తెచ్చాము. తెలంగాణ ఏర్పడి7ఏళ్లలో అపరమైన అభివృద్ధి సాధించాము. 24గంటలు ఉచిత విధ్యుత్ ఇచ్చే రాష్టం తెలంగాణ మాత్రమే.. 68లక్షల మెట్రిక్ టన్నుల నుండి 2కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే స్థాయిలో తెలంగాణలో వుంది.
23%హార్టికల్చర్ పెరిగింది.. 33జిల్లా లో 25జిల్లాలు అద్భుతమైన సాగు దిశలో వున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కి సహకరించాలి. 30లక్షల ఆయిల్ పామ్ సాగు చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నాం.. ప్రస్తుతం 5నుండి 10లక్ష లా ఆయిల్ పామ్ సాగు చేస్తున్నాం.. ఆయిల్ పామ్ సాగు చేస్తే సబ్సిడీ ఇస్తామని మంత్రి తెలిపారు.