మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ నేతలు..

20

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతుల్లా గ్రామంలో ప్రధానమంత్రి మోదీ చిత్రపటానికి బీజేపీ పార్టీ నేతలు పాలాభిషేకం చేశారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా యాచారం సబ్ స్టేషన్ నుండి చౌదర్ పల్లి,తులేఖూర్దు వయా కొలను గూడ గ్రామం వరకు 2.55 కోట్ల వ్యయంతో నూతనంగా రహదారిని నిర్మించినందుకు గాను ప్రధానమంత్రి చిత్రపటానికి బీజేపీ శ్రేణులు పాలభిషేకం చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ యాచారం మండల అధ్యక్షుడు తాండ్ర రవీందర్ మాట్లాడుతూ.. మారుమూల గ్రామాలకు సైతం రహదారులను ఏర్పాటు చేసి ప్రజలకు రవాణ సౌకర్యం అందించిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి, పల్లెలకు రోడ్డు మార్గాలను అనుసంధానం చేస్తు ప్రజలకు రవాణా సౌకర్యాలు కల్పిస్తుందని అన్నారు.