- Advertisement -
సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రగతి భవన్ లో జరగుతున్న ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంతో ప్రధానంగా ఆర్టీసీ అంశంపైనే ఈసమావేశం కొనసాగనుంది.
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో జరుగుతున్న విచారణ అంశాలు కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నది.
- Advertisement -